Home » మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య
Vadodara Gangrape

మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య

Spread the love

Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది!

ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది.
సెప్టెంబర్​ 20 అర్ధరాత్రి వీరి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు రెడీ చేసి వీరిద్దరూ విషం తాగారు. గదిలో నుంచి బయటకు వచ్చి మేం చనిపోతున్నామని పిల్లలకు చెప్పారు.

READ MORE  BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 5G సర్వీస్..

UP rape case : ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిని పరిశీలిస్తుండగా.. ఫోన్​లో వారికి ఒక వీడియో క్లిప్ లభించింది. విషం తాగే ముందు.. ఆ దంపతులు ఆ వీడియో రికార్డ్​ చేశారు. తమ మరణానికి కారణం 25 ఏళ్ల ఆదర్శ్​, 45 ఏళ్ల త్రిలోకి అని ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పారు. తనపై ఇద్దరూ సామూహిక అత్యాచారం చేశారని ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటూ రోదించింది.

READ MORE  Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇద్దరిని వెంటనే అరెస్ట్​ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వారు వెల్లడించారు. సెక్షన్​ 376డి, 306 కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మృతుడి భూమి అమ్మకం విషయంలో ఈ ఘటన జరిగినట్టు తేలిందని అధికారులు తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ , whatsApp చానల్ లోనూ జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..