మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య
Crime news : ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది!ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది.
సెప్టెంబర్ 20 అర్ధరాత్రి వీరి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు రెడీ చేసి వీరిద్దరూ విషం తాగారు. గదిలో నుంచి బయటకు వచ్చి మేం చనిపోతున్నామని పిల్లలకు చెప్...