Posted in

TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు

TSRTC New Buses
Spread the love

TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

TSRTC New Buses  ఇందులో 400 ఎక్స్ ప్రెస్ ‌ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, తోపాటు 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ నగరంలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలుచేపడుతుంది. ఈ కొత్త బస్సులన్నీ పలు విడుతల వారీగా వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలను సిద్ధం చేసింది.

మహిళలకు ఉచిత ఉచిత ప్రయాణంతో రద్దీ..

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Free Bus Scheme ) లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అత్యాధునిక హంగులతో 80 కొత్త బస్సులు శనివారం రోడ్డు ఎక్కించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఇందులో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను హైదరాబాద్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ మార్గ్ లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరులు ప్రారంభించనున్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *