Rashi Phalalu
మేషరాశి
మేష రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి . అత్యవసర పరిస్థితులకు తప్ప అధిక ధన వ్యయం చేయకూడదు. వస్త్ర వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరితో అకారణ కలహముకు దూరం గా ఉండండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంకల్పించిన పనులలో ఆటంక ములు ఎదురైనప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విలువైన వస్తువు లు జాగ్రత్త పరుచుకోవాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు గురవు తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి , ఆధ్యాత్మికము మరియు సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంతాన విషయంలో మానసిక ఆందోళనకు మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు. చర్మ సంబంధ మరియు వాత సంబంధ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కలవు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. ముఖ్యమైన విషయాలు మరచిపోకూడదు. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. హోటల్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మిధున రాశి
ఈ వారంలో నూతన పరిచయాల ద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు యోగ కాలము మరియు నూతన విద్యను అభ్యసించే వారికి సత్ఫలితాలు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. బంగారం మరియు వెండి వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. తండ్రితో అకారణ కలహాలకు దూరంగా ఉండండి. నూతన వాహన ప్రాప్తి కలదు. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండను. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి, వేడి పదార్థాలకు దూరంగా ఉండండి, కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు, తొందరగా అలసిపోతారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి గడ్డు కాలము. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార భాగ స్వాముల వలన నష్టం కలిగే అవకాశాలు కలవు. పితృదేవతల ఆశీర్వచనం దైవానుగ్రహం ఉంటుంది. వ్యాపార విస్తరణ నిమిత్తం బ్యాంక్ లోన్ మంజూరు అవుతుంది. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. శుభకార్యము నిర్వహించే అవకాశం కలదు. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారంలో రవాణా శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. విద్యార్థులకు మంచి కాలము, ఆర్థికపరమైన ఎదుగుదల కోసం నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మీ జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులను మరియు మానసిక వత్తిడి ఎదుర్కొంటారు. లగ్జరీ ఐటెమ్స్ కి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందు లు ఉండును. గృహము నందు శుభకార్యం నిర్వహించె అవకాశం కలదు. అనవసరమైన ఖర్చు లకు దూరంగా ఉండండి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశం కలదు. విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కన్య రాశి
కన్యరాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చెయ్ జారిపోగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. గృహములో నిర్మాణ సమస్యలు ఉండును. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మెలగాలి, బంధుమిత్రులని కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్న వారి వ్యూహాలు పలిస్తా యి. బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతాయి. మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి, ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వారం చివరిలో అధికమైన ధన వ్యయం ఉండును. పంటికి సంబం ధించిన ఆరోగ్య సమస్యలు వచ్చును. అప్పుగా ధనం ఎవరికి ఇవ్వకూడదు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగపరమైన ఎదుగుదల ఉంటుంది. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. సంతానపరమైన చికాకులు ఇబ్బందులు ఉండును. దాంపత్య పరమైన సమస్యలు ఉండును,. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. వేళ తప్పిన భోజనం ఉంటుంది. ఉష్ణ సంబంధ అనారోగ్య సమస్యలు ఉండును. ఏ నిర్ణయం అయినా పెద్దవారి సలహాలు తీసుకుంటారు. నూతన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తవుతాయి, పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. శారీరక శ్రమ గోచరిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు విదేశీయాన యోగము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సోదరులతో ఇబ్బందులు ఉండును. సంతానపరమైన ఆరోగ్య సమస్యలు ఉండును. విద్యార్థుల అధిక శ్రమ చేయవలసిన సమయం. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ఉంటుంది. స్కిన్ ఇన్ ఫెక్షన్ తో, రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. బంగారం వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండను. వ్యర్థ కలహాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులు మీ ప్రవర్తనను మరియు మాట తీరును వ్యతిరేకించే అవకాశాలు కలవు. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి యోగ కాలము. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మధ్యవర్తిత్వము ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. రెవెన్యూ శాఖ ఉద్యోగస్తులకు పదోన్న తులు ఉండును. వస్త్ర వ్యాపారస్తులకు కొంత ఇబ్బం దులు ఉన్నప్పటికీ సంతృప్తికరమైన ఆదాయం ఉం టుంది. స్త్రీలు వంట చేసేటప్పుడు పురుషులు వాహ నాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. దాంపత్య పరమైన సమస్యలు ఉండను. స్థిరాస్తులకు సంబంధిం చిన తగువులు ఏర్పడతాయి , ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. గృహంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. స్థూలకాయంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు, కుటుంబ పరమైన సమస్యలు ఉండును. రాజకీయరంగంలో ఉన్నవారు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు మరియు నూతన విద్యను అభ్యసించడానికి అడుగులు వేస్తారు. ధన పరమైన ఇబ్బందులు తొలగి ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి, కుల వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు యోగ కాలము. ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు. ఐరన్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. శత్రువులను కూడా మంచి మనసుతో క్షమిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ వారంలో పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ధన పరమైన ఇబ్బందులు ఉండును. కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా గడుపుతారు. మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి కొంత ఇబ్బందులు ఉండును. ఐరన్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. అసంతృప్తి భోజనం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు శరీరము అలసటకు గురవుతుంది. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. దాన ధర్మాలు నిర్వహిస్తారు. నిర్ణయాలు తీసుకునే విషయం లో అనుమానం లేకుండా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి, నూతన ఆదాయ మార్గాల ను అన్వేషిం చాలి, వృధా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, మీ జీవిత భాగస్వామితో కలహం అంత మంచిది కాదు. స్కిన్ ఇన్ ఫెక్షన్ తో.. శ్వాస కోశ అనారోగ్య సమస్య లతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. అసత్యం ఆడడం వలన ఇబ్బందులను ఎదు ర్కొంటారు. సంతాన అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు, మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపు తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978