
ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..
Rashi Phalalu
మేషరాశి
మేష రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి . అత్యవసర పరిస్థితులకు తప్ప అధిక ధన వ్యయం చేయకూడదు. వస్త్ర వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరితో అకారణ కలహముకు దూరం గా ఉండండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంకల్పించిన పనులలో ఆటంక ములు ఎదురైనప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విలువైన వస్తువు లు జాగ్రత్త పరుచుకోవాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు గురవు తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి , ఆధ్యాత్మికము మర...