
Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?
Weekly Horoscope Telugu : ఈ వారం ((24'th Dec - 30'th Dec)) రాశి ఫలాలు ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా ఉన్నాయి. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30 వరకు రాశి ఫలాలు ఒకసారి తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ వీటిని అందించారు.
మేష రాశి (24'th Dec - 30'th Dec)
మేష రాశి వారికి ఈ వారంలో సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలదు. వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేయికురుతుంది. మానసికపరమైన వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పను...