Home Telangana Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

0
9
Rain Alert
IMD Hyderabad
Spread the love

Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది.

ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని ఐఎండి తెలిపింది. అలాగే. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హనుమ‌కొండ, హైదరాబాద్‌, సిద్దిపేట, భువనగిరి, మెదక్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

 


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here