Posted in

Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..

TELANGANA BUDGET SESSION 2024
Spread the love

Telangana Budget |  2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఈ సదర్భంగా రాష్ట్రంలోని  కౌలు రైతులకు డిప్యూటీ సీఎం  గుడ్ న్యూస్ చెప్పారు.  రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని  ప్రకటించారు. ఏడాదికి ఒక ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు. ఈ రోజు  అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి  మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం  ద్వారా ఎక్కువగా అనర్హులే లబ్ధి పొందారన్నారు.  పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు.  రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి ఇకపై అర్హులైనవారికే రైతు బంధు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గృహ‌జ్యోతి ప‌థ‌కానికి రూ. 2,418 కోట్లు

Telangana Budget | తెలంగాణలోని అర్హులైన నిరుపేద కుటుంబాల‌కు గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను  అందించ‌నున్నామని  ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు అమ‌లుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం కోసం  బ‌డ్జెట్‌లో రూ. 2,418 కోట్లు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, డిస్క‌మ్‌ల‌కు రూ. 16,825 కోట్లు ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు భ‌ట్టి తెలిపారు

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

ప్రతీ మండలంలో అత్యాధునిక  సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (Telangana Public Schools) ను ఏర్పాటు చేయబోతున్నామని  మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు. కాలేజీ స్థాయిలోనే ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు ముందు స్థానంలో నిలిచేలా తీర్చిదిద్దుతాయని తెలిపారు. కాాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో పైలెట్‌ ప్రాజెక్టు గా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు..


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *