Special Train : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్-భావ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-భావనగర్ (07061) మధ్య జూలై 19, 26వ తేదీ నుంచి ఆగస్టు 2, 9వ తేదీల్లోఈ ప్రత్యేక రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే భావ్‌నగర్-సికింద్రాబాద్ (07062) రైలు జూలై 21, 28, ఆగస్టు 4, 11వ తేదీల్లో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
హాల్టింగ్ స్టేషన్లు..
ఈ రైళ్లు రెండు మార్గాల్లో మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముఖ్దేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాషిమ్, అకోల, భుస్వాల్, నందుర్బర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్, విరాంగమ్, సురేంద్రనగర్, ధోలా, సోంగద్ తదితర స్టేషన్లలో నిలుస్తాయని పేర్కొంది.
మరోవైపు బెంగళూరు-కాలబురిగి (06533) మధ్య ఈ నెల 19, కాలాబురిగి-బెంగళూరు (06534) మధ్య జూలై 20న ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు!
Special Train Secunderabad : ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముజఫర్‌పూర్ – సికింద్రాబాద్ (05293) రైలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతీ మంగళవారం ఉదయం 10.45 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి చేరుకొని మరుసటి రోజు రాత్రి 23.50 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. అలాగే సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్ (05294) రైలు ఈ నెల 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 తేదీ వరకు ప్రతీ గురువారం ఉదయం 3.55 బయలుదేరి.. శుక్రవారం మధ్యాహ్నం 4.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..