Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రహమత్ నగర్‌లో జరిగిన అమ్మమాట – అంగన్ వాడీ బాట కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తామని చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈమేరకు జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు, ఎమ్మెల్యేల ముట్టడికి యత్నించారు ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో అంగన్‌వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుండగా ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటులోకి తీసుకు వచ్చింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..