Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను ‘జవాన్లు’గా గుర్తించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
లాచెన్, లాచుంగ్‌లలో అనేక మంది బైకర్లు, విదేశీయులు, దాదాపు 700-800 మంది డ్రైవర్లతో సహా 3,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారందరినీ ఆర్మీ, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా రక్షించనున్నట్లు చీఫ్ సెక్రటరీ విబి పాఠక్ తెలిపారు.
సిక్కిం చీఫ్ సెక్రటరీ విజయ్ భూషణ్ పాఠక్ మాట్లాడుతూ “అందుబాటులో డేటా ప్రకారం లాచెన్, లాచుంగ్‌లలో సుమారు 3000 మంది చిక్కుకుపోయారు. 700-800 మంది డ్రైవర్లు అక్కడ చిక్కుకున్నారు. మోటారు సైకిళ్లపై అక్కడికి వెళ్లిన 150 మంది కూడా అక్కడ చిక్కుకుపోయారు. మేము ఆర్మీకి చెందిన హెలికాప్టర్లతో అందరినీ ఖాళీ చేయిస్తా.. లాచెన్, లాచుంగ్‌లలో చిక్కుకున్న వారిని ఆర్మీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ద్వారా మాట్లాడేలా చేసింది” అని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
వరదలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. పర్యాటకం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్నప్రజలు ఈ అతివృష్టితో సర్వం కోల్పోయారు. సిక్కిం, కాలింపాంగ్ జిల్లాలను కలిపే కాలింపాంగ్‌లోని రాంబి సమీపంలోని NH-10 వెంబడి ఉన్న దుకాణాలన్నీ నేలమట్టమయ్యాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.