Home » టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

Spread the love

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్ లో చదివిన ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ ను మాట్లాడుతామని బయటకు పిలిచారు. తమ వెంట తెచ్చిన గన్ తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

READ MORE  Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది

మరోవైపు టీచర్‌ కాలుపై కాల్పులు (Students Shoot Teacher జరిపి పారిపోయిన విద్యార్థులు తర్వాత ఒక రీల్‌ చేశారు. తమను తాము గ్యాంగ్ స్టర్స్ అని వీడియోలో చెప్పారు. ‘ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా… ఆ టీచర్ ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి’ అని ఒక విద్యార్థి అంటున్నట్లు వీడియోలో ఉంది.

READ MORE  Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌ అయింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు‌ చేశారు. టీచర్ పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. “విద్యార్థులు పోలీసుల అదుపులో ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసిన తర్వాత వారిద్దరినీ శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు” అని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోచింగ్ సెంటర్‌లో ఓ అమ్మాయితో తనకున్న అఫైర్ గురించి టీచర్ తన కుటుంబసభ్యులకు తెలియజేశాడని తెలిసింది. దీంతో అతడిపై కక్ష పెంచుకొని ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

READ MORE  Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..