Special trains | వేసవి సెలవుల్లో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఉత్తరాధికి సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లేవారి కోసం సికింద్రాబాద్ (Secunderabad) నుంచి దానాపూర్ (Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్, మే, జూన్ చివరి వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, అలాగే ప్రతీ శనివారం దానాపూర్ నుంచి బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ – బిహార్ (Uttar Pradesh-Bihar) రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వారానికోసారి అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఈ రైలును నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Danapur – Secunderabad Unreserved Special Trains revised date and timings as detailed below pic.twitter.com/CXt0icKbpp
— South Central Railway (@SCRailwayIndia) April 17, 2024
మరిన్ని ప్రత్యేక రైళ్లు
- Special trains : కాచిగూడ-కోచువెలి (07229) ఏప్రిల్ 18, 25వ తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్స్, కోచువెలి-కాచిగూడ (07230) ఏప్రిల్ 19, 26వ తేదీల్లో మరో రెండు ప్రత్యేక రైళ్లు,
- సికింద్రాబాద్-సంత్రాగచి(07221) ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి మంగళ, శనివారం 21ప్రత్యేక రైళ్ల్లు, సంత్రాగచి-సికింద్రాబాద్ (07222) ఏప్రిల్ 21నుంచి జూన్ 30 వరకు ప్రతి బుధ, ఆదివారం 21ప్రత్యేక రైళ్లు ఉంటాయి.
- ప్రయాగరాజ్-ఎస్ఎంవీటీబెంగుళూరు (04131) ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతీ ఆదివారం, ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-ప్రయాగరాజ్ (04132)ఏప్రిల్24 నుంచి జులై 3 వరకు ప్రతీ బుధవారం నడుస్తుంది.
- ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-గౌహతి (06521)ఏప్రిల్ 16 నుంచి జూన్ 25వ తేదీ వరకు ప్రతీ మంగళవారం, గౌహతి- ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-(06522) ఏప్రిల్ 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.
- ఎస్‌ఎంవీటీ బెంగుళూరు-మాల్దాటౌన్ (06565) ఏప్రిల్17 నుంచి జూన్ 26 వరకు ప్రతీ బుధవారం, మాల్దాటౌన్- ఎస్‌ఎంవీటి బెంగుళూరు-(06565) ఏప్రిల్ 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతీ శనివారం రాకపోకలు సాగిస్తుంది.
- హౌరా- యశ్వంత్‌పూర్ (02863) ఏప్రిల్ 18వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు, యశ్వంత్‌పూర్-హౌరా (02864) ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..