Special trains : సికింద్రాబాద్ నుంచి దానాపూర్ మధ్య అన్ రిజర్వ్‌డ్ కోచ్ లతో 24 ప్రత్యేక రైళ్లు..
Special trains | వేసవి సెలవుల్లో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఉత్తరాధికి సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లేవారి కోసం సికింద్రాబాద్ (Secunderabad) నుంచి దానాపూర్ (Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్, మే, జూన్ చివరి వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, అలాగే ప్రతీ శనివారం దానాపూర్ నుంచి బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ - బిహార్ (Uttar Pradesh-Bihar) రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వారానికోసారి అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లతో ఈ రైలును నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు.Danapur - Secunderabad Unreserved Special Trains revised date and timings as detailed below pic.twitter.com/CXt0icKbpp
— South...