Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ త్వరలో షురూకానుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇకపై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రేషన్ కార్డు ప్రామాణికం కాదని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి
- మొదట మీ దగ్గరలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించండి:
- తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. పూరించండి.
- అవసరమైన పత్రాలను సమర్పించండి.
- దరఖాస్తును సమర్పించి రసీదుని తీసుకొని భద్రపరుచుకోండి.
- ఈ రసీదు మీ దరఖాస్తు సంఖ్యను కలిగి ఉంటుంది. ఈ నెంబర్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తుంది.
మీ కొత్త Ration Card Application స్థితిని Check చేయడానికి ఈ స్టెప్స్ ని ఫాలో కండి.
- తెలంగాణ EPDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
- (https://epds.telangana.gov.in/FoodSecurityAct/)
- ఫుడ్ సేఫ్టీ కార్డ్ విభాగాన్నిక్లిక్ చేయండి.
- “Know Your New Ration Card Status” లేదా “Search FSC ” ఆప్షన్‌ని గమనించి దానిపై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలను పూరించండి..
- మీ FSC రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి, Search పై క్లిక్ చేయండి.
- ఒక విండో కనిపిస్తుంది.. మీ పేరు, అప్లికేషన్ నంబర్, FSC రిఫరెన్స్ నంబర్, పాత రేషన్ కార్డ్ నంబర్ (వర్తిస్తే), ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- ఫారమ్‌ను సమర్పించండి
- అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ కొత్త Ration Card స్టేటస్ Screen పై డిస్ల్పే అవుతుంది.
అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి మరో మార్గం:
- తెలంగాణ EPDS అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి..ఇందుకోసం ఇక్కడ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) క్లిక్ చేయండి.
- మీ వివరాలను నమోదు చేయండి
- మీ సివిల్ డిఫెన్స్ అప్లికేషన్ నంబరును నమోదు చేసి, Submit లేదా Search క్లిక్ చేయండి.
- అప్లికేషన్ స్థితిని వీక్షించండి:
- అన్ని వివరాలు సరిగ్గా సమర్పించినట్లయితే అప్లికేషన్ స్టాటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ముఖ్య గమనిక:
- రేషన్ కార్డు అప్లికేషన్ నంబర్: మీ అప్లికేషన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోండి..
- డేటా ఎంట్రీని రాష్ట్ర గెజిటెడ్ అధికారులు చేస్తారు.
- అర్హతను తనిఖీ చేయండి.. మీ కుటుంబం అర్హత కలిగి ఉంటే, ప్రభుత్వం మీకు రేషన్ కార్డ్ నంబర్‌ను కేటాయిస్తుంది.
- ఈ దశలను అనుసరించడం ద్వారా, తెలంగాణ దరఖాస్తుదారులు తమ కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. తద్వారా అవసరమైన సబ్సిడీలు, ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..