
Ration Card | తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇదే..
Ration Card Application | తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ త్వరలో షురూకానుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను ఇకపై వేర్వేరుగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తెల్ల రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను రేషన్ కార్డు ప్రామాణికం కాదని కూడా చెప్పారు. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకుల సరఫరా కోసం మాత్రమేనని, ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రం ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందేందుకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
కొత్త రేషన్ కార్డు...