Rain forecast | భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ తదుపరి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.
ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ, దక్షిణ హరియాణా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, గరిష్ఠంగా 44-48 డిగ్రీలుగా ఉన్నట్లు తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. అయితే.. జూన్‌లో వాయువ్య భారత దేశం, మధ్య ప్రాంతంలోని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో హీట్‌వేవ్స్ కొనసాగే చాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. అయితే ఇక రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. వేసవి వర్షాలపై ఎక్కువగా ఆధారపడే దేశానికి ఈ సారి ఎక్కువ వర్షాలు దోహదపడతాయని చెప్పింది. వ్యవసాయం, ఆర్థికవృద్ధికి ఊతమిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లో కేరళలో వర్షపాతం తీవ్రమయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (Rain forecast) , వాయువ్యంలో సాధారణం.. మధ్య- దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ రుతుపవనాలకు దోహదపడిందని పేర్కొంది. త్వరలోనే కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..