Rain forecast | గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ఈ సారి సమృద్ధిగా వర్షాలు..!
Rain forecast | భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ తదుపరి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ, దక్షిణ హరియాణా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, గరిష్ఠంగా 44-48 డిగ్రీలుగా ఉన్నట్లు తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్...