Home » Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..
Radhika Sarathkumar

Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..

Spread the love

 

Radhika Sarathkumar | ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్య‌ర్థిగా బీజేపీ (BJP)  పోటీలో నిలిపింది.  రాధిక భర్త శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. మొదట్లో ఆయన డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆయన ఏఐఏడీఎంకేను వీడి 31 ఆగస్టు 2007న ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు.

READ MORE  J&K Elections 2024 | 'భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మ‌ళ్లీ తీసుకురాదు'

గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున తెన్‌కాసి, నంగునేరి రెండు నియోజకవర్గాల్లో సమాక డబుల్‌ లీఫ్ గుర్తుపై విజయం సాధించింది. తెన్కాసిలో శరత్‌కుమార్‌, నంగునేరిలో ఎర్నావూరు ఎ.నారాయణన్‌ గెలుపొందారు. 2016లో శరత్‌కుమార్ తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యంతో పొత్తు పెట్టుకున్న శరత్‌కుమార్.. ఈనెల 12న సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.  యువత భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశామని,  పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి ప్రయాణం చేస్తామ‌ని శ‌ర‌త్ కుమార్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో నటి రాధిక శరత్‌కుమార్‌ను బరిలోకి దింపింది.

READ MORE  K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?

వందల సినిమాల్లో నటించిన రాధిక (Radhika Sarathkumar) బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నారు.  ఆమె రాడాన్ మీడియా వ్యవస్థాపరాలు కూడా.. దీని ద్వారా సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు.  2001లో నటుడు శరత్‌కుమార్‌, రాధిక‌ వివాహం జ‌రిగింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..