Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..
Adi Shankaracharya Statue : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )’ అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 […]
మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. . సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి ఈ […]
ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి
Telangana CMO WhatsApp channel : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది. ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్ ద్వారా […]
ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్
న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్‌తో సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వెల్లుల్లి వ్యాపారి నెల క్రితం కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి రూ. 5,600 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. […]
Viral Video : బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు.. ఇక ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడదు..
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా నగరాలు, పట్టణాల్లో వాహనదారులు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. వాహనాన్ని అతివేగంతో నడపడం,రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి నిత్యం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఫలితం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వెలిగేలా […]
రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది. రిలయన్స్ సంస్థ హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ […]
TS TRT recruitment 2023: సెప్టెంబర్ 20 నుంచి 5089 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. త్వరపడండి..
TS TRT recruitment 2023: డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. schooledu.telangana.gov.in. టీచర్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేయడానికి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనుంది. TS […]
TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..
మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్‌ను సెప్టెంబర్ 18న సోమవారం విడుదల చేసింది. BEd కోర్సుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్. 30. ఆసక్తి గల అభ్యర్థులు edcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, 2023–2024 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల BEd కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ […]
vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.
Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.. వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story) వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) […]
ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..
గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ.. సూరత్ లో “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా […]
