Delhi: కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక జంట ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఎప్పుడు వీడియో రికార్డింగ్ తేదీ చేశారో తెలియరాలేదు. కానీ ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అయింది. పెద్ద సంఖ్యలో వీక్షణలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఢిల్లీలో మెట్రో రైలు(Delhi Metro) ప్రయాణిస్తుండగా ఒక యువతి కూల్ డ్రింక్ ను తాగి ఆమె బాయ్ ఫ్రెండ్ నోట్లోకి నేరుగా పోసినట్లు ఉంది.
సిగ్గు లేకుండా విచక్షణ మరిచి ఈ జంట చేస్తున్న వింత చేష్టను చూసి కొంతమంది ప్రయాణికులు షాక్ అయ్యారు. మరికొందరు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు.
వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ కూడా “ఢిల్లీ మెట్రో(Delhi Metro)ను ఇప్పుడు మూసివేయాలా? లేదా వినోదానికి గొప్ప ప్రదేశమా?” అని క్యాప్షన్‌లో రాశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “X”లోని అనేక మంది.. ఈ వీడియోపై దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ జంట ఉద్దేశపూర్వకంగా వారి దృష్టిని ఆకర్షించే యత్నంగా భావించారు.
మరోవైపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కూడా సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోంది. ప్రయాణీకులు ఇలాంటి సంఘటనలను గమనించినట్లయితే వెంటనే తెలియజేయాలని పదేపదే కోరింది.
‘‘సరే, మేము సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. మేము కూడా ప్రయాణీకులకు పదేపదే విజ్ఞప్తి చేశాము. అందరూ తమ సహ-ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రవర్తించాలని’’ అని DMRC ఒక ప్రకటనలో తెలిపింది.
क्या अब दिल्ली मेट्रो बंद कर देना चाहिए?
या यह एक मनोरंजन का अति उत्तम स्थान है??
🚇Ⓜ️🚇Ⓜ️🚇Ⓜ️🚇🚆🚉🚊#viralreels#delhimetro#trending2023#ViralVideos#ShopeePromo1010
#Israel_under_attack #GazaUnderAttack #Gaza pic.twitter.com/4x8AbAe47U— SHASHIKANT YADAV (@ShashikantY10) October 10, 2023