2016 పఠాన్‌కోట్ (Pathankot ) ఉగ్రదాడి సూత్రధారి, కీలక సూత్రదారి లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్(Pakistan ) లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
పఠాన్‌కోట్(Pathankot) దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్(Shahid Latif) ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్‌కోట్ దాడికి ప్రధాన కుట్రదారు.
అతను సియాల్‌కోట్ నుంచే దాడికి వ్యూహ రచన చేశాడు. దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌కు పంపాడు.
చట్టవిరుద్ధమైన (కార్యకలాపాల) నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రవాద ఆరోపణలపై నవంబర్ 1994లో లతీఫ్ భారతదేశంలో అరెస్టు అయ్యాడు. విచారణ అనంతరం చివరికి జైలు పాలయ్యాడు. భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత, అతను 2010లో వాఘా మీదుగా పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.
మరోవైపు 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో కూడా లతీఫ్‌పై ఆరోపణలు ఉన్నాయి.
2010లో విడుదలైన తర్వాత లతీఫ్ పాకిస్థాన్‌లోని జిహాదీ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో తేలింది. అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుగా పేర్కొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.