Food Adulteration Drive 2026 | న్యూఢిల్లీ: హోలీ పండుగ సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ కుమార్ సింగ్ (Pankaj Kumar Singh) ఆదేశాల మేరకు ఆహార భద్రతా విభాగం గురువారం (ఫిబ్రవరి 26) నగరం పొడవునా మెరుపు దాడులు నిర్వహించింది.
66 నమూనాల సేకరణ – నిరంతర నిఘా
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లతో పాటు రోడ్‌సైడ్ విక్రేతల వద్ద నుండి మొత్తం 66 ఆహార నమూనాలను సేకరించారు. ఇందులో పాల ఉత్పత్తులు (Adulterated Sweets and Milk Products): పనీర్, ఖోయా వంటి హై-రిస్క్ వస్తువులు ఉన్నాయి. అలాగే నూనెలు & పప్పుధాన్యాల కింద 11 రకాల వంట నూనెలు, 17 రకాల తృణధాన్యాలను, 18 రకాల ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, ప్రోటీన్ ఉత్పత్తులపై నిఘా ఉంటుంది.
Food Adulteration Drive : కల్తీపై ‘జీరో టాలరెన్స్’
“ఢిల్లీ పౌరుల ఆరోగ్యమే మా ప్రాధాన్యత. ఆహార కల్తీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు” అని మంత్రి పంకజ్ సింగ్ స్పష్టం చేశారు. పండుగ సమయంలో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
FSSAI కీలక ఆదేశాలు – ‘హోలీ యాంటీ-కల్తీ డ్రైవ్ 2026’
FSSAI Holi Guidelines : కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల అధికారి (FSSAI) అన్ని రాష్ట్రాల ఆహార కమిషనర్లను అప్రమత్తం చేసింది.
సరిహద్దు నిఘా: నగర ప్రవేశ ద్వారాల వద్ద ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఖోయా, నెయ్యి, స్వీట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. కల్తీ వస్తువుల ప్రవాహాన్ని నిరోధించడానికి నగర ప్రవేశ ప్రదేశాల వద్ద నిఘా ముమ్మరం చేయగా, ప్రధాన ఖోయా/పనీర్ మార్కెట్లకు బృందాలు ప్రాధాన్యతనించ్చాయి . స్వీట్లు, స్నాక్స్, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కల్తీని నిరోధించే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది.
మొబైల్ ల్యాబ్స్: ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ (Food Safety on Wheels) వాహనాల ద్వారా మార్కెట్లలోనే తక్షణ పరీక్షలు నిర్వహించాలి. తనిఖీల వివరాలను మార్చి 31లోగా FoSCoRIS ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేయాలి.
జాతీయవాద వార్తలు, దేశభక్తి కథనాలు, తాజా టెక్నాలజీ, లైఫ్ స్టైల్ విశేషాల కోసం వందేభారత్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి. మా తాజా అప్‌డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి: వాట్సప్ ఛానల్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)
ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశహితం కోరుకునే మీ స్నేహితులతో ఈ కథనాన్ని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










