Home » Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..
Hyderabad Metro

Metro Tickets | ఇకపై నేరుగా రాపిడో నుంచే మెట్రో టికెట్లు బుక్ చేసుకోచ్చు..

Spread the love

Metro Tickets | హైదరాబాద్ ప్రయాణికులకు ఎండ్-టు-ఎండ్ ర‌వాణా సౌక‌ర్యాన్ని అందించడానికి, రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో (Rapido) యాప్ ద్వారా మెట్రో టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మెట్రో స్టేషన్లలో క్యూలైన్ల వద్ద రద్దీ కూడా తగ్గిపోతుంది. రాపిడో ద్వారా ప్రయాణికులు కనీసం 15 శాతం టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ భావిస్తోంది.

READ MORE  Dharani | ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కానికి లైన్ క్లియర్.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

ప్రయాణికులు ఇప్పుడు యాప్ ద్వారా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. వారు కోరుకున్న గమ్యస్థానానికి మెట్రో టిక్కెట్‌ల (Metro Tickets)ను సజావుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. చేయవచ్చు. మెట్రో సెక్టార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ (PPP), హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. Rapido కూడా రోజూ రెండు కోట్ల రైడ్‌లను కలిగి ఉంది.

“హైదరాబాద్ మెట్రో రైలులో, మా విలువైన ప్రయాణికులు సుల‌భ‌త‌ర‌మైన‌ ప్రయాణాలు చేసేలా అంకితభావంతో పనిచేస్తున్నాం. Rapidoతో ఈ కొత్త సహకారం సమర్థవంతమైన లాస్ట్‌ -మైల్‌ కనెక్టివిటీ సొల్యూషన్‌ను అందించడం ద్వారా ఈ నిబద్ధతను బలపరుస్తుంది” అని HMRL MD, ఎన్‌.వి.ఎస్‌ రెడ్డి పేర్కొన్నారు, శనివారం జ‌రిగిన‌ కార్యక్రమంలో ఎండి, సిఇఒ కెవిబి రెడ్డితో పాటు, సిఓఓ సుధీర్ చిప్లుంకర్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ హెడ్ బిభుదత్త మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

READ MORE  వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..