Sunday, April 27Thank you for visiting

IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

Spread the love

IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘దివ్య దక్షిణ యాత్ర’ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) – రామేశ్వరం – తిరువనంతపురం – కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. .

దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.

READ MORE  Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..

సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)

బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లు..

టికెట్ ధరలు

  • ఎకానమీ -రూ 14250 (పెద్దలకు)-
    రూ 13250 ( పిల్లలకు (5-11 సంవత్సరాలు)
  • స్టాండర్డ్- రూ 21900- రూ 20700
  • కంఫర్ట్- రూ 28450- రూ 27010

కవర్ చేసే ప్రముఖ దేవాలయాలు

  • తిరువణ్ణామలై- అరుణాచలం ఆలయం
  • రామేశ్వరం- రామనాథస్వామి ఆలయం
  • మధురై- మీనాక్షి అమ్మ వారి ఆలయం
  • కన్యాకుమారి- రాక్ మెమోరియల్, కుమారి అమ్మవారి టెంపుల్
  • త్రివేండ్రం – శ్రీ పద్మనాభస్వామి ఆలయం
  • తిరుచ్చి – శ్రీ రంగనాథస్వామి ఆలయం
  • తంజావూరు – బృహదీశ్వరాలయం

మొదటి రోజు :

సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది. తెలంగాణలోని కాజీపేట, వరంగల్, ఏపీలోని విజయవాడ, నెల్లూరు…సహా పలు స్టేషన్లలో ప్రయాణికుల బోర్డింగ్ ఉంటుంది.

రెండో రోజు :

తిరువణ్ణామలై స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పర్యాటకులను పికప్ చేసుకుని హోటల్ కు తీసుకువెళ‌తారు. రీఫ్రెష్ అయిన త‌ర్వాత అరుణాచలం ఆలయాన్ని బ‌య‌లుదేరుతారు. అక్క‌డ స్వామివారిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం కుదల్‌నగర్‌కు వెళ్లడానికి తిరువణ్ణామలై స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.

READ MORE  రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో 'శుభ ముహూర్తం' ఫిక్స్ చేసుకున్న దొంగలు

మూడో రోజు :

కూడల్‌నగర్ -రామేశ్వరం : కూడల్ నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసి.. రీఫ్రెష్ అయిన తర్వాత స్థానిక దేవాలయాలను సందర్శించవచ్చు. రామేశ్వరంలో రాత్రి అక్క‌డే బస చేస్తారు.

నాలుగో రోజు :

రామేశ్వరం – మధురై (కూడల్‌నగర్) : మధ్యాహ్నం భోజనం చేసిన‌ తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరారు. మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించుకుని, స్థానికంగా షాపింగ్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత‌ కన్యాకుమారికి రైలు ఎక్కేందుకు కూడల్ నగర్ రైల్వేస్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.

ఐదో రోజు :

కన్యాకుమారి : కొచ్చువేలి స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో కన్యాకుమారికి చేరుకుని హోటల్ లో చెక్ ఇన్ అవుతారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ ను తిల‌కిస్తారు. కన్యాకుమారిలో రాత్రి బస చేస్తారు..

READ MORE  Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

ఆరో రోజు :

కన్యాకుమారి – కొచ్చువేలి – తిరుచ్చి : కన్యాకుమారిలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేసిన త‌ర్వాత.. రోడ్డు మార్గంలో త్రివేండ్రంకు వెళ్లారు. త్రివేండ్రంలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ ను తిల‌కించి ఆస్వాదించ‌వ‌చ్చు. తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్ కు వెళ్తారు.

ఏడో రోజు :

తిరుచ్చి / తంజావూరు : తిరుచిరాపల్లి స్టేషన్‌కు రైలు చేరుకున్న త‌రువాత హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్ లో రీఫ్రెష్ అయ్యాక శ్రీరంగం ఆలయానికి వెళ్తారు. లంచ్‌ తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కిలోమీట‌ర్లు) కి బ‌య‌లుదేరుతారు. తంజావూరు బృహదీశ్వరాలయాన్ని సందర్శిస్తారు. ఆ త‌ర్వాత‌ సికింద్రాబాద్ తిరుగు ప్రయాణానికి గాను తంజావూరులో రైలు బయలుదేరుతుంది.

ఎనిమిది, తొమ్మిదో రోజు :

IRCTC Divya Dakshin Yatra ముగింపు పర్యాటకుల గమ్యస్థానాల్లో డీ-బోర్డింగ్ చేస్తారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..