రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్
చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని సేకరించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పలు విడతలుగా విరాళంగా ఇచ్చారు. 75 ఏళ్ల పూల్ పాండియన్ (Pool pandian) 2010 నుంచే ఇలా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల రూపాయలను పోగు చేసి ప్రభుత్వానికి విరాళంగా అందించారు. గతనెల పూల్పాండియన్ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీ జాన్ వర్గీస్ ను కలుసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన చివరి విరాళం రూ.10,000 అందజేశారు. భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, వయసు సంబంధిత సమస్యలతో భిక్షాటన కష్టమైపోతోందని, విరాళం ఇవ్వడం ఇదే చివరి సారి అని పూల్ పాండియన్ తెలిపారు. తనకు ఇల్లు లేదని, ఏదైనా ఆశ్రమాన్ని చేరుకొని అక్కడే శేష జీవితం గడుపుతానని తెలిపారు.
భార్య మరణంతో..
పూల్ పాండియన్ స్వస్థలం టుటికోరిన్ జిల్లాలోని పాతంకులంలోని అలంగినార్. పూల్ పాండియన్ 1979లో తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా టుటికోరిన్ లోని ఒక దుకాణంలో పని చేస్తూ బొంబాయికి వెళ్లారు. అతను తన పిల్లలను చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాడు. అతని భార్య సరస్వతి అనారోగ్యంతో 24 ఏళ్ల క్రితం మరణించింది. ఆమె మరణించిన తరువాత పూల్ పాండి జీవితంపై విరక్తి చెందాడు. తరువాత తమిళనాడుకు తిరిగి వచ్చి తన పిల్లలను పెంచాడు. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఇతన్ని చూసుకోవడం మానేశారు. దాంతో భిక్షాటన చేయటం మొదలుపెట్టాడు. ఒంటరిగా జీవించడం ప్రారంభించాడు. కొన్నేళ్లకు 2010లో తమిళనాడుకు వెళ్లారు.
ఆపదలో ఆపన్న హస్తం
పూల్ పాండియన్ ఇప్పటివరకు ఎంతోమందికి ఆపన్న హస్తం అందించారు. టుటికోరిన్లో సాతంకులం షూటింగ్ సమయంలో తన భిక్షాటన డబ్బులు అందించారు. , శ్రీలంక దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడినపుడు ఆ దేశానికి డబ్బు విరాళంగా అందించారు. చెంగల్పట్, విల్లుపురలో కల్తీ మద్యం సేవించి మరణించిన బాధితులకు సహకారం అందించారు. కోయంబత్తూర్, నీలగిర్స్, మదురై జిల్లాల కలెక్టర్లకు కూడా డబ్బు విరాళంగా అందించారు. తిరుచ్చి జిల్లాల కలెక్టర్లకు కూడా డబ్బు విరాళంగా ఇచ్చారు. “నేను ఇతరుల నుండి భిక్ష సేకరించి దానం చేయడం ప్రారంభించిన తర్వాత, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ సంతృప్తి కలిగిందని పూల పాండియన్ అన్నారు. అందుకే పేదలకు సహాయం చేయడానికి, పేదలకు విద్యను అందించడానికి విరాళం అందించానని చెప్పారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి