Home » పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి
Israel-Hamas war

పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి

Spread the love

అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్

Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు.

సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశారు. విద్యార్థులు ఎలాంటి మెటీరియల్‌ను పోస్ట్ చేయకుండా ఆంక్షలు విధించారు. చిత్రాలను పోస్ట్ చేసిన మాజీ విద్యార్థిని పాఠశాల వాట్సప్ గ్రూప్ నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

READ MORE  Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్

స్మార్ట్‌ఫోన్‌లలో వీడియోలు చూసిన చాలా మంది తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని సదరు విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హమాస్ మిలిటెంట్లు యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో ప్రజల గొంతు కోస్తున్న వీడియోల (Israel-Hamas war)ను మాజీ విద్యార్థి పోస్ట్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ధ్రువీకరించారు.

అయితే దీనిపై స్కూల్ యాజమాన్యం లేదా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. రామ్‌ఘర్ డిప్యూటీ కమిషనర్ చందన్ కుమార్ పిటిఐకి మాట్లాడుతూ, పరిపాలన సమస్యను పరిశీలించి, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

READ MORE  జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?

వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..