Home » Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు
New Flyovers

Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

Spread the love

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్..  ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌కు అత్యంత కీల‌క‌మైన హైదరాబాద్ – విజయవాడ ర‌హ‌దారి (Hyderabad-Vijayawada National Highway) విస్త‌ర‌ణ‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్త‌రించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్ర‌మ‌లో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎన్‌ ‌హెచ్‌ఏఐ ‌ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌ ‌చౌదరిని కోరారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని బదులిచ్చారు.

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( National Highway Authority of India (NHAI)) పరిధిలో రహదారుల నిర్మాణానికి త‌లెత్తున్న‌ సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ‌ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్‌ ‌ధరలు ఎక్కువగా ఉండడంతో భూములను ఇచ్చేందుకు రైతులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని కలెక్టర్లు వెల్ల‌డించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్లు రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలన్నారు.

READ MORE  Telangana Road ways | మోదీ 3.0 100 రోజులప్రణాళికలో తెలంగాణకు రెండు నేషనల్ హైవేస్..

మ‌రోవైపు రీజినల్‌ ‌రింగు రోడ్డు (Regional Ring Road (RRR) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వేరుగాచూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్‌ ‌కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ (Nitin Gadkari)ని కోరగా, ఆయన సూతప్రాయంగా ఆమోదించిన‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో భూ సేకరణలో ఉన్న ఇబ్బందుల‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. అలైన్‌ ‌మెంట్‌ ‌విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ ‌హన్మంత్‌ ‌కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్‌ ‌దాఖలు చేయాలని కలెక్టర్‌ ‌కు సీఎం సూచించారు.

READ MORE  2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..

నాగ్ పూర్ విజయవాడ కారిడార్..

నాగ్‌ ‌పూర్‌-‌విజయవాడ కారిడార్‌లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ గురించి సీఎం ఆరా తీశారు. పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌రహదారి పనులు కొనసాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌ ‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని తెలిపారు. జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అన్నారు. హైదరాబాద్‌ -‌మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధికారులకు సూచించ‌గా అందుకు ఎన్‌హెచ్‌ ఏఐ అధికారులు అంగీకరించారు.

READ MORE  TGSRTC Cargo Service | రాష్ట్ర ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు..

ఇదిలా ఉండ‌గా నాగ్‌పూర్‌-‌విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎన్‌ ‌హెచ్‌ఏఐ అధికారులను మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ కోరారు.  ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల‌, విజయవాడ-నాగ్‌పూర్‌ కారిడార్‌ల కోసం అటవీశాఖ భూ బదలాయింపులకు సంబంధించి అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా అటవీ భూములను సేకరించి ప్రభుత్వ భూములను కేటాయించాలని రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..