
Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Hyderabad| తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై కలెక్టర్లు ఇక నుంచి రోజూవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యన అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలన...