Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana | రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
Spread the love

RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Hyderabad| తెలంగాణ రాష్ట్ర‌ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల‌ను వేగవంతం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై కలెక్టర్లు ఇక నుంచి రోజూవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్యన‌ అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించాల‌ని, నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేలా నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

READ MORE  కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

భవిష్యత్‌ అవసరాలే ప్రాతిపదికగా రిజిన‌ల్ రింగ్ రోడ్డ్‌ అలైన్‌మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.

సంగారెడ్డి, భువ‌న‌గిరి చౌటుప్ప‌ల్ మార్గంలో..

ఆర్ఆర్ఆర్ (Regional Ring Road ) కింద ఉత్తర భాగం సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలోని (చౌటుప్ప‌ల్-ఆమ‌న్‌గ‌ల్‌ -షాద్ న‌గ‌ర్‌ -సంగారెడ్డి (189.20 కి.మీ.)మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ,అలైన్‌మెంట్‌ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి వెంట‌నే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని చెప్పారు.

READ MORE  Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

ఈ సమీక్ష సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర  అధికారులు పాల్గొన్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *