
Alto K10 And S-Presso | భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న విషయ తెలిసిందే.. అయితే మారుతీ వాహనాల భద్రత విషయానికి వస్తే మిగతా కంపెనీల కంటే చాలా వెనుకబడి ఉంది. దీనిని దృష్ఠిలో పెట్టుకొని ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ తన కార్లలో సేఫ్టీ టెక్నాలజీని మెరుగుపరచడం ద్వారా పరిశ్రమలో తన ఇమేజ్‌ను పెంచుకోవాలని చూస్తోంది. తాజాగా మారుతి ఆల్టో K10, S-ప్రెస్సోలో భద్రతా ఫీచర్‌గా ఎలక్ట్రానిక్ సేఫ్టీ ప్రోగ్రామ్ (ESP)ని జోడించింది.
రెండు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల అన్ని వేరియంట్‌లు ఇప్పుడు ESPని కలిగి ఉన్నాయి. కొత్త ఫీచర్‌ను జోడించినప్పటికీ, రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఆహ్వానించదగిన విషయం. ఈ అప్‌డేట్‌తో, Eeco మినహా అన్ని మారుతి సుజుకి మోడల్‌లు ఇప్పుడు ESP ఫీచర్ అందుబాటులో ఉంది.
ESP ఎలా పని చేస్తుంది?
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సిస్టమ్ స్కిడ్డింగ్ ను నిరోధించడం ద్వారా వాహనం రోడ్డుపై జారిపోకుండా సాఫీగా వెళ్లేందుకు సాయపడుతుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ( TCS ), స్టెబిలిటీ కంట్రోల్ (SC)ని ఏకీకృతం చేయడం ద్వారా, ESP సిస్టమ్ వాహనం కదలిక, డైనమిక్‌లను పర్యవేక్షించడానికి సెన్సార్ల నెట్‌వర్క్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ డేటా అధునాతన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ద్వారా వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఇది వాహనం వెళ్లే మార్గాన్ని విశ్లేషిస్తూ సర్దుబాటు చేస్తుంది, తద్వారా మొత్తం స్థిరత్వం, నియంత్రణ, డ్రైవింగ్ భద్రతను మెరుగుపరుస్తుంది.
ఇతర భద్రతా లక్షణాలు
Alto K10 And S-Presso మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని స్టాండర్డ్ సేఫ్టీ సూట్‌లో ESPతో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, స్టీరింగ్ కాలమ్ మొదలైనవి ఉన్నాయి. అయితే, రోడ్డు & రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశం ప్రకారం, అన్నీ ప్యాసింజర్ వాహనాలు తప్పనిసరిగా 31 అక్టోబర్ 2024 నుంచి అన్ని బ్రాండ్‌లు, విభాగాలలో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉండాలనే నిబంధన విధించింది.
మారుతి ఆల్టో K10, S-ప్రెస్సో: స్పెక్స్
మారుతి సుజికీ ఆల్టో కె10, మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో రెండూ హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌కు ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌లు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 67 bhp, 91 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తాయి. ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ద్వారా నిర్వహిస్తాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..