Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..
హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రద్దయిన రైళ్ల జాబితా.. …