Elevated Corridor | ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నగరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు ట్రాపిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) ప్రాంతంతో ఇరుకైన రోడ్డులో వాహనదాారులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు.
క్యారిడార్ నిర్మాణం
రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం సమీపంలో గల ప్యాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై కార్ఖానా, తిరుమలగిరి, బల్లారం, ఆళ్వాల్, హకీంపేట, తూంకుంట. మీదుగా శామీర్ పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారిపై 11.12 కిలో మీటర్ల పొడవుతో ఆరు లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఈ కారిడార్ పూర్తయితే.. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు వెళ్లే వారికి ప్రయాణం చాలా సులభమవుతుంది.
మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు ఉండగా, ఎలివేటెడ్ కారిడార్ పొడవు 11.12 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అండర్‌గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ. ఉంటుంది. ఫియర్స్ 287 ఉండనుండగా, 197.20 ఎకరాల భూమి అవసరమవుతోందిి. ఇందులో రక్షణ శాఖకు చెందిన 113.48 ఎకరాల మేర భూమి ఉంది. ప్రైవేట్ ల్యాండ్, 83.72 ఎకరాలు కావల్సి ఉంది. ప్రాజెక్టు మెుత్తం వ్యయం రూ.2,232 కోట్లు కాగా.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నగరం నుంచి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చాలా సులభంగా ఓఆర్‌ఆర్ వరకు చేరుకోవచ్చు.
Elevated Corridor ముఖ్యాంశాలు
- మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ.
- ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.
- అండర్గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
- అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
- రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
- ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు
- ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు
ప్రయోజనాలు ఇవీ
రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్ పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణం వీలవుతుంది. ఇంధనం తక్కువ ఖర్చ కావడంతో వాహనదారులకు వ్యయం కూడా తగ్గిపోతోంది.. సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు వరకు చేరుకోవచ్చు. ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణం వల్ల మేడ్చల్-మల్కాజిగిరి–సిద్దిపేట-కరీంనగర్-పెద్దపల్లి-మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..