Home » Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు
Metro Phase - 2

Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Spread the love

Old City Metro Project : హైదరాబాద్‌లోని ‌పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్‌ ‌నగర్‌ ‌డిపో వ‌ద్ద‌ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ ‌సిటీ కాదు.. ఒరిజినల్‌ ‌హైదరాబాద్‌.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత త‌మ‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

మెట్రో స్టేష‌న్లు ఎక్క‌డ‌?

మెట్రో లైన్‌ ఎంజీబీఎస్‌, ‌దారుల్‌ ‌షిఫా జంక్షన్‌, ‌పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ ‌చౌక్‌, అలీ జాకోట్ల, ర్‌ ‌మోమిన్‌ ‌దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్‌ ‌గంజ్‌, అలియా బాద్‌ ‌ప్రాంతాల మీదుగా ఫలక్ ‌నుమా వరకు ఈ మెట్రో లైన్ ‌ను నిర్మించ‌నున్నారు. సాలర్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం, చార్మినార్‌, ‌శాలిబండ, ఫలక్‌ ‌నుమా ఏరియాల్లో మెట్రో స్టేషన్లు నిర్మిస్తారు. మతపరమైన చారిత్రక కట్టడాలకు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా రోడ్డు విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేశారు. స్టేషన్ల వద్ద రోడ్డును 120 ఫీట్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ లైన్‌ అం‌దుబాటులోకి వస్తే చార్మినార్‌, సాలర్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను తిల‌కించేందుకు పర్యాటకులకు సౌకర్యంగా ఉంటుంది.

READ MORE  Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..

కాగా ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మెట్రోను పొడిగించనున్నారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోటర్ల పొడవునా ఈ రైలు మార్గంలో ఐదు మెట్రో స్టేషన్లు ఉంటాయి. దీనికి సుమారు రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ ‌నుంచి జేబీఎస్‌, ఎం‌జీబీఎస్ ‌మీదుదుగా పాత బస్తీకి సులువుగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియం, చార్మినార్‌, ‌శాలిబండ, షంషిర్‌ ‌గంజ్‌, ‌ఫలక్‌ ‌నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఉంటాయి. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే స‌రిపోతాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ ‌సిటీ మెట్రో (Old City Metro Project) అందుబాటులోకి వస్తే వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్‌ ‌కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని భావిస్తున్నారు.

READ MORE  Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..