Ghatkesar -Lingampalli Train Service : ఘట్ కేసర్ – లింగంపల్లి రైలు సర్వీస్, సంగారెడ్డిలో మంగళవారం రూ.7,200కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘట్ కేసర్ – లింగంపల్లి – మౌలాలి – సనత్ నగర్ మీదుగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) రైలు సర్వీస్ నుకూడా మోదీ ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్.. హైదరాబాద్ – సికింద్రాబాద్ వ్యాప్తంగా ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవలను అందించనుంది.
ఘట్ కేసర్-లింగంపల్లి మార్గంలో తొలి రైలు మంగళవారం ఉదయం 10.45 గంటలకు మొదటి ప్రయాణం ప్రారంభించి మధ్యాహ్నం 12.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.
మౌలాలి-సనత్ నగర్-మీదుగా ఘట్ కేసర్ -లింగంపల్లి ఎంఎంటీఎస్ ఫీచర్లు..
- ఈ సర్వీస్ MMTS పరిధిని ప్రస్తుత 90 కి.మీ (44 స్టేషన్లు) నుండి 123.52 కి.మీ (53 స్టేషన్లు)కి పెంచుతుంది.
- కొత్త విభాగం MMTSని తూర్పు వైపున ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ దాటి విస్తరించి, పశ్చిమ భాగంలోని వ్యాపార ఆర్థిక కేంద్రంతో కలుపుతుంది.
- ఈ కొత్త రైలు ద్వారా 48 కిలోమీటర్ల తూర్పు-పశ్చిమ కారిడార్ ఘట్ కేసర్, చెర్లపల్లి, మల్లాపూర్, నేరేడ్ మెట్, ఈసీఐఎల్, సుచిత్ర, భూదేవినగర్ మొదలైన ప్రాంతాలను హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతుంది.
- ఈ మార్గంలో సాధారణ సర్వీసులు మార్చి 6 నుంచి ప్రారంభమవుతాయి.
- మొదటి సాధారణ రైలు ఘట్ కేనర్ లో ఉదయం 7.20 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. చివరి రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు ఘట్ కేసర్ చేరుకుంటుంది.
Ghatkesar MMTS ప్రయాణికులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నారు. మొదటిసారిగా, ఈ రైలు సర్వీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలలో ప్రసిద్ధ నబర్బన్ రైలు సేవను కొత్త ప్రాంతాలకు విస్తరించింది. ఇది నగరంలోని తూర్పు వైపున గల చర్లపల్లి, మౌలాలి వంటి కొత్త ప్రాంతాలను హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది.
అందుబాటులోకి సనత్ నగర్ మౌలాలి మార్గం..
Sanathnagar- Moula Ali Train : రూ.343 నిధులతో 22కిలోమీటర్ల దూరం గల సనత్ నగర్, మౌలాలి రైల్వే లైన్ డబ్లింగ్, అలాగే ఆటోమెటిక్ సిగ్నలింగ్ సిస్టంతో విద్యుదీకరణ, ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా పూర్తయిన ఆరు కొత్త స్టేషన్ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
రైల్వే స్టేషన్ భవనాలు ఫిరోజ్ గూడ, సుచిత్ర సెంటర్, భూదేవినగర్, అమ్ముగూడ, నేరెడ్మెట్ , మౌలా అలీ హౌసింగ్ బోర్డ్ ఉన్నాయి. అలాగే హై-లెవల్ ప్లాట్ ఫారంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్ ఫారం షెల్టర్లు మొదలైనవి ఉన్నాయి.
ఈ సెక్షన్లో మొదటిసారిగా ప్యాసింజర్ రైళ్లను (ఎక్స్ ప్రెస్ స్పెషల్స్ ) ప్రవేశపెట్టడానికి ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుంది. అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్-మౌలా అలీ అలాగే సికింద్రాబాద్-లింగంపల్లి సెక్షన్లపై భారాన్ని తగ్గిస్తుంది. ఇంతకుముందు సనత్ నగర్ – మౌలా అలీ సెక్షన్ కేవలం సరుకు రవాణా రైళ్లకు మాత్రమే వినియోగించేవారు.. తాజాగా ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లు కూడా పరుగులుపెట్టనున్నాయి. ఇది రైళ్ల సమయపాలన, సగటు వేగాన్ని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
Ghatkesar to Lingampally MMTS pic.twitter.com/VUa5WiSS7U
— Hi Warangal (@HiWarangal) March 6, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..