Home » Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..
Maha Shivaratri tsrtc

Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..

Spread the love

Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు వెల్లించారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9వ తేదీన 329 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, నర్సంపేట సిరిసిల్ల, కోరుట్ల, మెట్ పల్లి,ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుస్తాయని తెలిపారు.

READ MORE  Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయానికి ఉచిత బస్సు సర్వీసులు

ఈ మూడు రోజులపాటు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయ సౌజన్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను కూడా నడిపించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇప్పటికే అధికాలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏపీలోని శ్రీశైలం (Srishailam) కూడా శివరాత్రి వేడుకల (Maha Shivaratri)కు ముస్తాబవుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం తరపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. సాయంత్రం రావణవాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శమివ్వనున్నారు.

READ MORE  New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..