Delhi Liquor Scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మరో దిల్లీ ఆప్ పార్టికీ చెందిన మంత్రికి ఈడీ సమన్లు పంపింది. దర్యాప్తు అధికారి ముందు శనివారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు. విచారణ కోసం ఫెడరల్ ఏజెన్సీ గహ్లాట్‌ను పిలిపించడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం ED కస్టడీలో ఉండగా, సంజయ్ సింగ్, సిసోడియా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ఇదిలా వుండగా ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ED ఆరోపణను AAP ఖండించింది. నకిలీ ఆరోపణలపై ప్రత్యర్థి పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి EDని కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. కాగా కైలాష్ గహ్లాట్ కు సమన్లకు పంపిన అంశంపై పార్టీ ఇంకా స్పందించలేదు.
ఈ కేసుకు సంబంధించిన ED అధికారులు కైలాష్ గహ్లాట్ సమన్‌పై వివరాలను వెల్లడించనప్పటికీ.. ఎక్సైజ్ పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లాట్ కూడా ఉన్నారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పేర్కొంది. ED కైలాష్ గహ్లాట్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను రూపొందించినప్పుడు జరిగిన సమావేశం గురించి ఆయన్ను ప్రశ్నించనుంది. దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలపై సీబీఐ విచారణ చేస్తుండగా, మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ జరుపుతోంది.
ఎక్సైజ్ పాలసీ స్కాంలో (Delhi Liquor Scam) లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవితతో సహా రాజకీయ నేతలు కుట్ర పన్నారని కోర్టు ముందు ED పేర్కొంది. వ్యాపారవేత్త శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కె కవితలతో కూడిన సౌత్ గ్రూప్ కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం ఢిల్లీలోని 32 జోన్‌లకు తొమ్మిది జోన్‌లను పొందింది. టోకు వ్యాపారులకు ఏకంగా 12% ప్రాఫిట్ మార్జిన్‌తో, చిల్లర వ్యాపారులకు దాదాపు 185% ప్రాఫిట్ మార్జిన్‌తో ఈ పాలసీ తీసుకువచ్చారు. ఇందులో 12% మార్జిన్‌లో 6% హోల్‌సేల్ వ్యాపారుల నుండి తిరిగి వసూలు చేయాలని, AAP నాయకులకు కిక్‌బ్యాక్ అని ED ఆరోపించింది.
ఈ పథకాన్ని నిర్వహిస్తున్న విజయ్ నాయర్ (ఆప్ అప్పటి కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి)కి సౌత్ గ్రూప్ ₹ 100 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించిందని, ఆప్ నాయకుల తరపున కుట్ర చేసిందని ED ఆరోపించింది . “విజయ్ నాయర్ ఆప్‌కి చెందిన సాధారణ కార్యకర్త కాదు, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు…” అని కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఏజెన్సీ పేర్కొంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..