
Delhi Liquor Scam | దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు జారీ
Delhi Liquor Scam | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మరో దిల్లీ ఆప్ పార్టికీ చెందిన మంత్రికి ఈడీ సమన్లు పంపింది. దర్యాప్తు అధికారి ముందు శనివారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు. విచారణ కోసం ఫెడరల్ ఏజెన్సీ గహ్లాట్‌ను పిలిపించడం ఇదే తొలిసారి. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రస్తుతం ED కస్టడీలో ఉండగా, సంజయ్ సింగ్, సిసోడియా ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.ఇదిలా వుండగా ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ED ఆరోపణను AAP ఖండించింది. నకిలీ ఆరోపణలపై ప్రత్యర్...