Home Telangana Gurukulam Admissions : విద్యార్థులకు అలర్ట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు...

Gurukulam Admissions : విద్యార్థులకు అలర్ట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..

0
12
Gurukulam Admissions 2024
Spread the love
  • దరఖాస్తుకు ఏప్రిల్ 12వరకు గడువు…
  • ఏప్రిల్ 28న పరీక్ష

Gurukulam Admissions |హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు ఈ పరీక్షకు అర్హులని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 21 నుంచి వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని తెలిపారు, దరఖాస్తు సహా ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైటు ను సందర్శించాలని సూచించారు.

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం (Gurukulam Admissions) పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్య, భోజన వసతితో పాటు యూనిఫామ్, పుస్తకాలు, నోట్ బుక్స్ సహా పలు సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు.. కాగా ప్రస్తుతం బీసీ గురుకులం పరిధిలో 15 బాలుర, 15 మహిళా డిగ్రీ కళాశాలలు, ఎస్సీ గురుకులంలో 26 మహిళా కాలేజీలు, ఎన్టీ గురుకులంలో 6 బాలుర, 15 మహిళా కళాశాలలున్నాయి. ఈ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీహెచ్ఎంసీటీ, బీఎఫ్ సహా వివిధ కోర్సులు అందుబాటులో ఉండగా.. ప్రతి కోర్సులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here