పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించనందుకు ఓ దళిత మహిళను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి బలవంతంగా మూత్రం తాగించారు. సభ్య సమాజం చీదరించుకునే ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రూ.9,000 రుణానికి రూ.1,500 వడ్డీ చెల్లించనందుకు దళిత మహిళపై దాడి చేసి, బట్టలు విప్పి, బలవంతంగా మూత్రం తాగించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో బాధిత మహిళ తలపై గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. కేవలం రూ.1500 వడ్డీ చెల్లించకపోవడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడారని తెలిపారు.
బాధిత మహిళ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులోని ఆరోపణలను పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న నిందితులను పట్టుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు
రాత్రి 10 గంటల సమయంలో పంపు నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. “సుమారు ఆరుగురు వ్యక్తులు నన్ను పట్టుకుని నగ్నంగా చేసి, నాపై దారుణంగా దాడి చేశారు. నిందితుల్లో ఒకరు మూత్రం తీసుకుని బలవంతంగా నా నోటిలోకి పోశాడు. ఆ తర్వాత వారు కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు. తలకు గాయాలయ్యాయి. నేను ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాను’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్( chief minister Nitish Kumar ), ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. బీజేపీ అధికార ప్రతినిధి యోగేంద్ర పాశ్వాన్ తీవ్రంగా ఖండించారు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.