ఆ గ్రామం మొత్తం మాదేనన్న సున్నీ వక్ఫ్ బోర్డు, ఆందోళనకు దిగిన గ్రామస్థులు
Patna | ఆ గ్రామం మొత్తం తమదేనని, నెలరోజుల్లో గ్రామస్థులందరూ ఖాళీ చేయాలని బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు (Sunni Waqf Board) డిమాండ్ చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నా జిల్లాలోని గోవింద్‌పూర్ లో జరిగింది. గ్రామం మొత్తం తమదేనని పేర్కొంటూ, 30 రోజుల్లోగా భూమిని ఖాళీ చేయాలని కోరుతూ బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో వివాదం మొదలైంది.ఈ గొడవల నేపథ్యంలో ఫతుహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నేత సత్యేంద్ర సింగ్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు గోవింద్ పూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ బృందం తన నివేదికను పాట్నా సాహిబ్ రవిశంకర్ ప్రసాద్‌కు సమర్పించనుంది. నిర్వాసితులకు న్యాయం చేస్తామని బృందం హామీ ఇచ్చింది. "ఎంపి రవిశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు మేము బాధిత గ్రామాన్ని సందర్శించాము" అని...