Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: chief minister Nitish Kumar

వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..
Crime

వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించనందుకు ఓ దళిత మహిళను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి బలవంతంగా మూత్రం తాగించారు. సభ్య సమాజం చీదరించుకునే ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.9,000 రుణానికి రూ.1,500 వడ్డీ చెల్లించనందుకు దళిత మహిళపై దాడి చేసి, బట్టలు విప్పి, బలవంతంగా మూత్రం తాగించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధిత మహిళ తలపై గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. కేవలం రూ.1500 వడ్డీ చెల్లించకపోవడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడారని తెలిపారు. బాధిత మహిళ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్...