BAPS Hindu Mandir : అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయాన్ని రేపు 14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన భారీ సమావేశం జరుగుతుంది. దీనికి అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి శంకుస్థాపన చేశారు.
వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా..
ఈ భారీ దేవాలయం (BAPS Mandir) 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని పింక్ శాండ్ స్టోన్‌తో కొత్త, పాత వాస్తు కళలతో నిర్మించారు. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుక రాయిని అక్కడికి తీసుకెళ్లారు. అత్యాధునిక టెక్నాలజీ, సెన్సార్లను ఏర్పాటు చేశారు. . ఆలయంలో మొత్తం 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత వాయిద్యాలు, సంగీత విద్యాంసులతోపాటు అనేక శిల్పాలను అద్భుతంగా చెక్కారు. ఆలయ ఎత్తు 108 అడుగులు ఉంది. నిర్మాణానికి 40 వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని వినియోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా ఉపయోగించారు.
ఈ ఆలయాన్ని 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డులకెక్కింది.. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. . రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడు నాలుగు సంవత్సరాల పాటు శ్రమించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
వివిధ దేవతల మందిరాలు
ఈ ఆలయంలో ఏడు మందిరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి భారతదేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ దేవతలు ఇక్కడ కొలువుదీరారు. ఈ దేవతలలో రాముడు, సీతాదేవి, హనుమంతుడు, శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, జగన్నాథుడు శ్రీకృష్ణుడు, రాధ, ; శ్రీ అక్షర్-పురుషోత్తం మహారాజ్, తిరుపతి వేంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. . ప్రతీ మందిరంలో ఆయా దేవతల జీవిత చరిత్రలు, బోధనలను ప్రతిబింబించే శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది.
శివాలయంలో అద్భుతమైన శిల్పాలు ‘శివపురాణం’ లోని శ్లోకాలను వర్ణిస్తాయి. 12 ‘జ్యోతిర్లింగాల’ డొమైన్‌లను వివరిస్తాయి. ‘జగన్నాథ యాత్ర’ లేదా ‘రథయాత్ర’ వేడుక జగన్నాథుని మందిరంలో చక్కగా మలిచారు. శ్రీకృష్ణుడి ఆలయ గర్భగుడి లోపల ‘భాగవత్’ ‘మహాభారతం’ కథలను వివరించే శిల్పాలను చూడవచ్చు.
BAPS Hindu Mandir ముఖ్యాంశాలు..
- BAPS హిందూ మందిర్ UAEలో మొదటి సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం.
- అద్భుతమైన నిర్మాణం 27 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది .
- BAPS హిందూ మందిర్ అబుదాబిలోని అబు మురీఖా జిల్లాలో ఉంది.
- ప్రారంభ రోజున దాదాపు 2000-5000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం తెలిపారు
- ఆలయానికి 2019 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
- అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 2015లో ప్రధాని మోదీ దేశ పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 13.5 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.
- జనవరి 2019లో, UAE ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది, తద్వారా ఆలయం కోసం మొత్తం 27 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చింది.
- 2018లో, ప్రధాని మోదీ అబుదాబిలో ఆలయానికి పునాది వేశారు.
- నివేదికల ప్రకారం , BAPS హిందూ మందిర్ నిర్మాణ వ్యయం 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లుగా అంచనా వేశారు.
- ఈ ప్రాజెక్ట్‌ను మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో బ్రహ్మవిహారిదాస్ స్వామి పర్యవేక్షిస్తున్నారు
- ఈ ఆలయం సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిలో నిర్మిచారు.
- BAPS హిందూ మందిర్ ప్రారంభోత్సవ వేడుకను ‘సామరస్య పండుగ’గా జరుపుకుంటారు.
- అబుదాబిలో ప్రధాని ‘అహ్లాన్ మోడీ’ ఈవెంట్ కోసం 65,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు
1 Day to go!#HistoryOfHarmony pic.twitter.com/MZALkUReY2
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) February 13, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..