Sunday, April 27Thank you for visiting

Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Spread the love

Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు.

ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) ,  కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-’25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు.

Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి , ప్రజలపై ఎటువంటి వ్యయ భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ” అని ఆయన చెప్పారు.

READ MORE  Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..

ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలను తమ అధికార పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తుంది. “అదే సమయంలో, ఈ పథకం ప్రజలకు మరింత ఆదాయం రావడానికి,  విద్యుత్ బిల్లుల భారం తగ్గించడానికి అలాగే ప్రజలకు ఉపాధి కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని ” అని మోడీ తెలిపారు.

రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ కింద, సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) ప్యానెల్‌లు భవనం, ఇల్లు పై కప్పులపై స్థిరంగా ఉంటాయి. ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఈ – https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు

How to Apply solar rooftop solar : పీఎం సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చుడండి..

READ MORE  Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

దశ 1

మొదట పోర్టల్‌లో కింది వివరాలు నమోదు చేసుకోండి:

  • మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
  • మీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి
  • మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను పూరించండి.
  • మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి
  • మీ ఇమెయిల్‌ను నమోదు చేయండి

దశ 2

  • మీ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి
  • ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి

దశ 3

  • మీ సాధ్యత ఆమోదం కోసం వేచి ఉండండి
  • మీ డిస్కామ్‌లో నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి

దశ 4

  • ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి

దశ 5

  • నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్కామ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాత.. పోర్టల్ నుండి కమీషనింగ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.
READ MORE  Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

దశ 6

  • మీరు కమీషనింగ్ నివేదికను ఒకసారి పొందండి. పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, కాన్సల్ చెక్కును సమర్పించండి.
  • మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో మీ సబ్సిడీని అందుకుంటారు.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..