Home » Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..
Top Smart TV Deals Under Rs.20000

Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..

Spread the love

వచ్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival sale 2023) తేదీని ముందే ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబరు 8న ప్రారంభం కానుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్స్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పటిలాగే ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచే ‌ముందస్తుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్స్, డిస్కౌంట్లను కూడా టీజ్ చేసింది. SBI కార్డ్ హోల్డర్లు.. ఉత్పత్తులపై 10 శాతం ఇన్ స్టాండ్ డిస్కౌంట్ పొందగలరు. ఈ సేల్ లో మొబైల్‌లు, యాక్సెసర్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అలాగే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు.

ఇ-కామర్స్ కంపెనీ వివిధ మొబైల్ ఫోన్‌లు, ఉపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర గృహోపకరణాల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్ ఆఫర్లను తెలిపే ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించింది. అందులో Apple , Asus , Lenovo , OnePlus , iQoo , Realme , Samsung , boAt, Sony వంటి భారతీయ, గ్లోబల్ బ్రాండ్‌ల కు చెందిన పరికరాలు తక్కువ ధరలకు లభించనున్నాయి. అమెజాన్ సేల్స్ సందర్భంగా తమ కంపెనీకి చెందిన దాని అమేజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండ్ల్ పరికరాలను కూడా తక్కువ ధరలకు అందించవచ్చు.

READ MORE  Reliance Jio Prepaid Plans | రిలయన్స్ జియో నుంచి ఓటీటీలు అందించే రూ. 329, రూ. 949 రూ. 1049 ప్లాన్లు.. 

ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.

సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది అమెజాన్ ఈ సంవత్సరం మల్టీ సేల్ రౌండ్‌లను నిర్వహించే అవకాశముంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్‌లు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కి ముందస్తు యాక్సెస్ పొందుతారు. ఈ ఈవెంట్ లో వీరికి అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలు, అదనపు వారంటీలు కూడా ఉంటాయి.

స్మార్ట్ ఫోన్స్ ఫై డీల్స్

Amazon Great Indian Festival sale 2023 కు సంబంధించి, అమెజాన్ తన ఇ-కామర్స్ సైట్‌లో అనేక కిక్‌స్టార్టర్ డీల్‌లను వెల్లడించింది. Samsung Galaxy S23 , Nokia G42 5G, Motorola Razr 40, Tecno Pova 5 Pro, Redmi 10 Power, Lava Agni 2 పై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు చూపిస్తోంది. ఇంకా, OnePlus Nord 3 , Samsung Galaxy M34 5G, Redmi 12 5G ఈ ఈవెంట్‌లో తగ్గింపు ధరలకు లభిస్తాయని భావిస్తున్నారు.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో తమ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు EMI లావాదేవీలను ఉపయోగించి కొనుగోళ్లు చేసే కస్టమర్‌లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి అమెజాన్ SBIతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా, అమెజాన్ పే ఆధారిత చెల్లింపు ఆఫర్‌లు కూపన్ తగ్గింపులు ఉంటాయి.
ఇదిలా ఉండగా అమెజాన్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఫ్లిప్‌కార్ట్ కూడా తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు సేల్ ఈవెంట్‌ నిర్వహిస్తోంది .

READ MORE  New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.

ఆఫర్లు తెలుసుకునేందుకు అమేజన్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో  సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..