Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ వీడియోను ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి X (ట్విట్టర్)లో షేర్ చేశారు. “ఏనుగు, దాని సంరక్షకుని మధ్య బంధం – అది అతనిని వెళ్ళనివ్వదు!” వీడియోతో పాటు కాప్షన్ రాశారు,
ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.
ఏనుగు తన ట్రంక్‌తో తన సంరక్షకుడి(caretaker)ని కౌగిలించుకుని, తను వదిలి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం అంగీకరించదు. వీడియోలో మావటిని మరో వ్యక్తి బైక్ పై తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఆ ఏనుగు అతనిని తన తొండంతో చుట్టి అడ్డుకుంటుంది. ఏనుగు తన తోక సాయంతో సంరక్షకుని దగ్గరగా ఉంచుకుంటుంది. చివరికి, కేర్‌టేకర్ స్కూటీపై వెళుతున్నట్లు కనిపిస్తాడు.. కానీ ఏనుగు వెంటనే పరిగెత్తుకుంటూ అతని వైపునకు దూసుకెళ్లి వాహనాన్ని ఆపింది. ఏనుగు తన తొండంతో మెల్లగా అతనికి ఇబ్బంది కలగకుండా సున్నితంగా సంరక్షకుడిని కిందికి రమ్మని ఒప్పిస్తుంది.
ఈ వైరల్ వీడియోను సెప్టెంబర్ 27న షేర్ చేయగా ఇప్పటివరకు 33,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు, వ్యూస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో చూసి చాలా మంది ఆసక్తిర కామెంట్లు చేస్తున్నారు.
The bonding between the elephant and it’s caretaker – it won’t just let him go! ❤️ #elephants #bonding @Gannuuprem pic.twitter.com/AOkTmi7ceJ
— Ananth Rupanagudi (@Ananth_IRAS) September 27, 2023
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.