పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు.
స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు.
అతని కడుపులోంచి బయటకు తీసిన దాదాపు వంద వస్తువులలో ఇయర్‌ఫోన్స్, వాషర్లు, నట్స్ అండ్ బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు ఉన్నాయి. లాకెట్‌లు, బటన్‌లు, రేపర్‌లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, సేఫ్టీ పిన్ ఉన్నాయి.
ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ ‘ఇలాంటి కేసును చూడడం ఇదే మొదటిదని, ఆ వ్యక్తి రెండేళ్లుగా కడుపు సమస్యలతో బాధపడుతున్నాడు. అతని శరీరం నుంచి అన్ని వస్తువులను తొలగించినప్పటికీ, వ్యక్తి పరిస్థితి నిలకడగా లేదు ’ అని డాక్టర్ చెప్పారు. ఆ వస్తువులు చాలా కాలం పాటు అతని కడుపులో ఉన్నాయి. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైంది.
ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.
ఇదిలా ఉండగా ఆ రోగి కుటుంబం కూడా షాక్ కు గురైది. వారు కూడా కడుపులో నుంచి తీసిస వస్తువులను చూసి ఆశ్చర్యపోయామని, అతను వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడో తెలియదని చెప్పారు. అతను వస్తువులను ఎలా తినగలిగాడు అనే దాని గురించి అతని తల్లిదండ్రులకు ఎటువంటి క్లూ లేదు.. అయితే అతను మానసిక వ్యాధులతో బాధపడుతున్నాడని చెప్పాడు.
అతను కడుపునొప్పి వస్తుందని తమకు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. అతను ఆసుపత్రిలో చేరడానికి కొన్ని రోజుల ముందు సరిగ్గా నిద్ర పోలేదు.. వారు అతడిని ఇంతకు ముందు చాలా మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.. కానీ అతని నొప్పి వెనుక గల కారణాన్ని ఎవరూ నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.