Home » ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ
woman slaps jjp mla

ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ

Spread the love

కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, ఆహారం, వరద సమస్యలతో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని Jannayak Janta Party  ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంతలో ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళతోపాటు ఇతర స్థానికులు “ఇప్పుడు ఎందుకు వచ్చారు?” అంటూ ప్రశ్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను రక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మహిళను క్షమించానని, ఆ మహిళపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోనని అన్నారు. “నేను మహిళపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోను, నేను ఆమెను క్షమించాను,” అని చెప్పారు.

READ MORE  నోరూరించే నీరా పానీయం రెడీ..

మరోవైపు, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా 10 మంది మరణించారని, వరదలు మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తెలిపారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ .4 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు . “వరదల్లో ఇప్పటి వరకు 10 మంది మరణించారు.. ఈ సంఖ్య పెరగవచ్చు, ఇద్దరు గల్లంతయ్యారు. చాలా పశువులు మరణించాయి.. నష్టాన్ని అంచనా వేస్తాము. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం”. అని ఖట్టర్ అన్నాడు.

READ MORE  సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఖట్టర్ ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. “గత నాలుగు రోజులుగా, హర్యానా (Haryana) లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో వరదలు వచ్చాయి” అని ఖట్టర్ విలేకరుల సమావేశంలో అన్నారు.


 

READ MORE  ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..