ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..
Spread the love

ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World’s Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ
విమానాశ్రయంగా నమోదైంది.

విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది.

“ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను సంపాదించుకుంది” అని ముంబై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయం ఆధునిక విమాన ప్రయాణాన్ని ప్రతిబింబించే అనుభవాన్ని అందిస్తుంది. ఇది భారతీయ సంస్కృతిని కూడా ప్రదర్శిస్తుందని, ప్రయాణీకులకు పరిచయం చేస్తుందని తెలిపారు. “CSMIA ఇప్పుడు పొడవైన లేఓవర్‌లను కోరుకునే ప్రయాణీకులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఎందుకంటే ఇది వారికి అందుబాటులో ఉన్న సమృద్ధిగా ఉన్న సౌకర్యాలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ట్రావెల్ + లీజర్ ప్రతి సంవత్సరం వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ కోసం సర్వేను నిర్వహిస్తుంది.  టాప్ హోటల్‌లు, రిసార్ట్‌లు, స్పాలు, క్రూయిజ్ షిప్‌లు, ఎయిర్‌లైన్స్,  మరిన్నింటిపై దాని పాఠకుల అభిప్రాయాన్ని కోరుతుంది. ఈ ఏడాది మ్యాగజైన్‌కు దాదాపు 1,65,000 మంది పాఠకులు సర్వేను పూర్తి చేశారని ఓ ప్రకటనలో పేర్కొంది.


 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *