Home » యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..
Shocking News

యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

Spread the love

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.
యూపీ పోలీసుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit womam) తన ముస్లిం స్నేహితురాలికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సెప్టెంబరు‌ 2న ఓ కేఫ్ కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ వద్దకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలి వెంట ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఓ వ్యక్తి బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్..
వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. అనంతరం ఇద్దరూ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ తతంగాన్నంతటినీ వీడియో తీశారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. వెంటనే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను సదరు యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

READ MORE  వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..